వరదల్లో కేరళ.. రూ.కోటి విరాళం ప్రకటించిన జగన్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 20, Aug 2018, 2:59 PM IST
jagan donate rs.1crore to kerala relief fund
Highlights

తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేరళకు రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని కేరళ సీఎం సహాయనిధినికి పంపించనున్నారు.

భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయం ప్రకటించారు. కాగా.. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేరళకు రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని కేరళ సీఎం సహాయనిధినికి పంపించనున్నారు. వరదలు, వర్షాల నుంచి కేరళ త్వరగా కోలుకోవాలాని జగన్ ఆకాంక్షించారు. 

జగన్ కేరళలో వర్షాలు, వరదలపై ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడం బాధాకరమని.. ఈ కష్ట సమయంలో తన ప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెంట ఉంటాయన్నారు. కేరళ ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు కేంద్రం సహకారం అందించాలని కూడా జగన్ కోరారు. ఇవాళ ఆయన తన సాయాన్ని ప్రకటించారు. 

loader