కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను వెళ్లడంపై గురువారం శాసనసభలో టీడీపి సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంతో సఖ్యతతో మెలిగితే తప్పేమిటని ప్రశ్నించారు. నదీ జలాలను స్నేహపూర్వకంగా పంపిణీ చేసుకోవడానికి కేసీఆర్ ముందుకు వచ్చారని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలోనే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని, అప్పుడేం చేశారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన స్నేహ హస్తం చాచారు.