పంచాయితీ ఎన్నికలు: రంగంలోకి సీఎం జగన్ బావమరిది
కృష్ణా జిల్లాలో పంచాయితీ ఎన్నికల్లో సీఎం జగన్ బావ మరిది యువరాజ్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఈ విషయమై టీడీపీ నాయకులు వైఎస్ఆర్‌సీపీ నేతలతో గొడవకు దిగారు.
విజయవాడ: కృష్ణా జిల్లాలో పంచాయితీ ఎన్నికల్లో సీఎం జగన్ బావ మరిది యువరాజ్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఈ విషయమై టీడీపీ నాయకులు వైఎస్ఆర్‌సీపీ నేతలతో గొడవకు దిగారు.
కృష్ణా జిల్లాలోని గణపవరంలో సోమవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఈ గ్రామంలో 100 మంది కార్యకర్తలతో యువరాజ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి గడువు పూర్తైన తర్వాత ప్రచారం ఎలా నిర్వహిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
యువరాజ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ నేతలు వీడియో తీశారు. ఈ సమయంలో టీడీపీ నేతలతో యువరాజ్ రెడ్డి గొడవకు దిగారు. వీడియో తీసిన ఫోన్లను యువరాజ్ రెడ్డి ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏపీలో పంచాయితీ ఎన్నికలను పురస్కరించుకొని రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బలవంతపు ఏకగ్రీవాలు, కిడ్నాప్ లు చోటు చేసుకొన్నాయి.అధికారాన్ని ఉపయోగించుకొని బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ ప్రయత్నించిందని ఆరోపించాయి విపక్షాలు.
రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలు ఈ నెల 9వ తేదీన జరగనున్నాయి.ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.