విజయవాడ:ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీచైతన్య, నారాయణ కాంపస్‌లలో ఆదాయపన్ను శాఖాధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలోని  హైద్రాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాలేజీ రికార్డులను అధికారుల స్వాధీనం చేసుకొన్నారు.

మరో వైపు ఏపీ రాష్ట్రంలో కూడ నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయవాడకు సమీపంలోని  తాటిగడప, ఈడ్పుగల్లులోని క్యాంప‌స్‌లలో సోదాలు నిర్వహించారు. ఈ క్యాంపస్‌లలో ఉన్న పలు రికార్డులను కూడ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

 బుధవారం నాడు  ఉదయం  ఎనిమిది గంటల నుండి  ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.