చట్టపరంగా ఆయుర్వేద మందు కాదు: ఆనందయ్య మందుపై ఆయుష్ కమిషనర్
ఆనందయ్య మందు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాతే పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆనందయ్య మందు గురించి సీఎం జగన్ కు పూర్తి వివరాలు అందించామన్నారు.
అమరావతి: ఆనందయ్య మందు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాతే పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆనందయ్య మందు గురించి సీఎం జగన్ కు పూర్తి వివరాలు అందించామన్నారు. ఈ మందు చట్టపరంగా ఆయుర్వేద మందుగా పరిగణించలేమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నాడు మధ్యాహ్నం ఆయన సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ఆయుర్వేద మందా కాదా అని గుర్తించేందుకు ఆయుర్వేద చట్టం ఆధారంగా గుర్తించాల్సి ఉంటుంది.ఈ చట్టంలో పొందుపర్చిన 56 పుస్తకాల్లో ఆనందయ్య ఉపయోగిస్తున్న పదార్ధాలు ఉన్నాయన్నారు.అయితే దీనికి కొన్ని పద్దతులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ కారణంగానే ఈ మందును ఆయుర్వేద మందుగా గుర్తించలేమన్నారు.
also read:క్లినికల్ ట్రయల్స్ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం: ఆనందయ్య మందుపై వైవీ సుబ్బారెడ్డి
ఆనందయ్య తయారు చేస్తున్న మందులో ఉపయోగిస్తున్న తోక మిరియాలతో పాటు ఇతర పదార్ధాలతో కళ్లకు ఎలాంటి హాని కలగదని ఆయుర్వేదంలో చెప్పినట్టుగా ఆయన వివరంచారు. ఆనందయ్య తయారు చేస్తున్న ముందులో ఉపయోగిస్తున్న పదార్ధాలతో కానీ, ఈ మందు వల్ల కానీ ఏమైనా హాని కలుగుతుందా అనే విషయమై పరిశోధించాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు.ఈ విషయమై పరిశోధనలు సాగుతున్నాయని ఆయుష్ కమిషనర్ రాములు చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో తుది నివేదిక వస్తొందని కమిషనర్ రాములు తెలిపారు.
ఈ మందు కారణంగా ఈ ప్రాంతంలో కరోనా కేసులు కానీ, కరోనాతో మరణాలు కూడ తక్కవగా ఉన్నాయని స్థానికులు నమ్ముతున్నారని కమిషనర్ తెలిపారు. ఈ మందును ఉపయోగించిన వారిలో కొందరితో తాను స్వయంగా ఫోన్‌లో మాట్లాడినట్టుగా ఆయన తెలిపారు. తాను ఫోన్ చేసిన వారంతా పాజిటివ్ గా సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. ఆనందయ్య మందుపై నేత్ర వైద్యులతో కూడ సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు.