Asianet News TeluguAsianet News Telugu

సీఎం జ‌గ‌న్ స‌ర్కారు తీరుతో పెట్టుబ‌డులు రాకుండా పోతున్నాయి.. : ఏపీ ప్రభుత్వంపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు

Vijayawada: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మ‌రోసారి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. కేర‌ళ స్టోరీ త‌ర‌హాలో "ఇది ఆంధ్రా స్టోరీ. దేశంలోనే ధనిక సీఎం కథ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాఫియాలకు సింగల్ డాన్ గా అతను లక్షల కోట్లను ఎలా దోచుకుంటాడు... అధికారం కోసం పేదలను ఇంకా పేదలుగా ఎలా మారుస్తాడు... తన దోపిడీ కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఎలా మారుస్తాడు... చూడాల్సిందే!.. " అంటూ ట్విట్ట‌ర్ లో ఒక పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. 
 

Investors do not have confidence to invest in Andhra Pradesh: Chandrababu Naidu RMA
Author
First Published May 20, 2023, 3:30 PM IST

TDP national president N.Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైకాపా ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. ప్ర‌భుత్వ ప‌నితీరు కార‌ణంగా రాష్ట్రానికి పెట్టుబ‌డులు రాకుండా పోతున్నాయ‌ని పేర్కొంది. పారిశ్రామిక‌వేత్త‌లు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆస‌క్తి చూప‌నివిధంగా ప‌రిస్థితుల‌ను దారుణంగా మారుస్తున్నార‌ని ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించింది. 

వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క పెట్టుబడిదారుడు కూడా ముందుకు రావడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ) ప్రవాహంలో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానానికి పడిపోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఒకప్పుడు ఎఫ్ డిఐలను ఆకర్షించే టాప్ 5 భారతీయ రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జాబితాలో అట్టడుగున పడి 14 వ స్థానంలో ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అన్నారు.

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేవలం తన సొంత ఆస్తులు, పీఆర్ గురించే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్డీఐల గురించి కానీ, ఏపీ యువతకు కల్పించే ఉద్యోగాల గురించి కానీ ఆయనకు పట్టింపు లేదని విమ‌ర్శించారు.  ఏపీకి పెట్టుబ‌డులు తీసుకురావ‌డంలో వైకాపా స‌ర్కారు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఆరోపించారు. ఈ ఏడాది మార్చిలో పార్లమెంటులో కేంద్రం పంచుకున్న సమాచారం ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి మధ్య ఆంధ్రప్రదేశ్ 511.7 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలను ఆకర్షించింది. ఎఫ్ డీఐ ఈక్విటీ ప్రవాహంలో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఇదిలావుండ‌గా, కేర‌ళ స్టోరీ త‌ర‌హాలో "ఇది ఆంధ్రా స్టోరీ. దేశంలోనే ధనిక సీఎం కథ.  అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాఫియాలకు సింగల్ డాన్ గా అతను లక్షల కోట్లను ఎలా దోచుకుంటాడు...అధికారం కోసం పేదలను ఇంకా పేదలుగా ఎలా మారుస్తాడు... తన దోపిడీ కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఎలా మారుస్తాడు... చూడాల్సిందే!.." అంటూ ట్విట్ట‌ర్ లో తెలుగుదేశం పార్టీ ఒక పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios