తల్లిదండ్రుల ఎడబాటు భరించలేక.. భవిష్యత్తులో తన తల్లికి భారం కాలేక ఓ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లా రాప్తాడులోని మోడల్ స్కూల్ లో జరిగింది.
జీవితం ఓ అందమైన ప్రయాణం.. అందులో కష్టాలుంటాయి.. సుఖాలుంటాయి.. మనకు ఎదురయ్యే సమస్యల గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే.. ఆ సమస్యలన్నింటికీ చక్కని పరిష్కారం కచ్చితంగా దొరుకుతుంది. కానీ.. క్షణికావేశానికి గురై.. తమ 100 ఏండ్ల జీవితాన్ని అర్థంతరంగా మధ్యలోనే ముగించేసుకుంటున్నారు.అత్యధికంగా ఆత్మహత్యకు పాల్పడేవారు యువతే కావడం బాధకరం. క్షణికావేశ నిర్ణయాలతో.. అయినవారికి ఆవేదన మిగుల్చుతున్నారు.
తాజాగా తల్లిదండ్రుల ఎడబాటు భరించలేక.. భవిష్యత్తులో తన తల్లికి భారం కాలేక ఓ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లా రాప్తాడులోని మోడల్ స్కూల్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బుక్కపట్నంకి చెందిన రమేష్ బాబు- సరస్వతి దంపతులు. వీరికి వీరికి ఇద్దరు సంతానం. తొలుత సాఫీగా సాగిన వీరి వైవాహిక జీవితం.. ఐదేళ్ల కిందట మనస్పర్ధలు రావడంతో వేరుగా ఉంటున్నారు. సరస్వతి కుమార్తె, కుమారుడితో పుట్టింటిలో ఉంటుంది. రోజువారి కూలీ పనులు చేసుకుంటూ.. తన పిల్లలను సదుకుంటుంది. కుమార్తె మణిదీప (18)ను రాప్తాడులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. భార్యతో దూరంగా ఉన్న రమేష్ తన పిల్లలను తరుచు కలిసేవాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకునేవాడు.
కానీ. కొద్ది రోజులు క్రితం ఆయన నూతన గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ క్రమంలో తన మణిదీప కంటపడ్డాయి. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన తండ్రి గృహా ప్రవేశ కార్యక్రమం చేపట్టారని తీవ్ర మానస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు విడిపోయినా తండ్రి తరచూ పాఠశాల వద్దకు వచ్చి పలకరించేవాడనీ. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తన తండ్రి శుభకార్యం చేసుకున్నాడనీ, తమను దూరం పెట్టడాని తీవ్ర ఆవేదనకు గురైంది.
ఆ విషయాన్ని పాఠశాలోని స్నేహితులకు, తన తల్లితో చెప్పుకుని బాధపడింది. తల్లిదండ్రులు విడిపోవడం, తమ కోసం తన తల్లి కష్టపడటం చూసిన మణి దీప..తన తల్లికి భవిష్యత్తులో ఏవిధంగా భారం కావొద్దని శుక్రవారం రాత్రి పాఠశాలలో హెయిర్ డై తాగి.. ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన.. తన స్నేహితులు పాఠశాల వార్డెన్‌కి వనజకు సమాచారం ఇవ్వడంతో ఆ విద్యార్థిని వెంటనే అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ, శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవ రెడ్డి తెలిపారు.
