అమరావతి: ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద గతంలో ఇచ్చిన ఉత్తర్వులను మరో మూడు వారాలు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఏబీ వెంకటేశ్వర రావు గతంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పెటిషన్ పెట్టుకున్నిారు. దాంతో అప్పుడు ఏబీ వెంకటేశ్వర రావుపై రెండు వారాల పాటు ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ రెండు వారాల పాటు వ్యవధి కోరింది. దీంతో మూడు వారాల పాటు ఏబీ వెంకటేశ్వర రావుపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు వేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి హయాంలో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.