ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు  జయరామ్ కు  ఐటీ శాఖాధికారులు నోటీసులు ఇచ్చారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాంకు  ఐటీ శాఖ అధికారులు నోటీసులు  జారీ చేశారు.  మంత్రి జయరాంతో పాటు  ఆయన  భార్య  రేణుకమ్మకు  కూడా  నోటీసులు జారీ  చేశారు.  ఇట్టినా  భూముల  విషయంలో  ఐటీ శాఖాధికారులు నోటీసులు  ఇచ్చారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. . 

ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని  ఆస్పరి మండలంలో ఇట్టినా కంపెనీకి రైతులు  భూములను విక్రయించారు.  2006లో  ఈ భూములను  రైతులు  అమ్మారు. అయితే  ఇందులో  100 ఎకరాలను  తాను  కొనుగోలు  చేసినట్టుగా  మంత్రి జయరాం ప్రకటించారు.  ఈ భూములను మార్కెట్ ధరకు  రైతులకే  రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని  కూడా ఆయన  ప్రకటించారు.  2022 డిసెంబర్ మాసంలో  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  జయరాం  ఈ  ప్రకటన  చేసిన విషయం తెలిసిందే.

ఈ భూముల విషయంలో  మంత్రి జయరాం, ఆయన సతీమణి రేణుకమ్మకు  2022 అక్టోబర్ 30వ తేదీన  ఐటీ శాఖాధికారులు  నోటీసులు  జారీ  చేశారు. ఇట్టినా భూముల్లో  మంత్రి జయరాం భార్య రేణుకమ్మ పేరున 30 ఎకరాలు  కొనుగోలు  చేశారు ఈ భూముల  కొనుగోలుకు  రూ. రూ. 52. 42 లక్షలు  చెల్లించారు. ఈ విషయమై ఐటీ అధికారులు  నోటీసులు ఇచ్చారు.