చెన్నై: టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కంపెనీల్లో  మూడో రోజు కూడ ఐటీ సోదాలు సాగుతున్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన  బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై రెండు రోజులుగా ఐటీ సోదాలు సాగుతున్న విషయం తెలిసిందే.

బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై 13 చోట్ల  ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  తమిళనాడులోని మాగుంట గ్రూపు సంస్థల వ్యాపార దేవీలపై కూడ ఆరా తీస్తున్నారు. చెన్నై బజుల్లా రోడ్డులోని ప్రధాన కార్యాలయం నుండి సాగుతుంటాయి. 

 చెన్నై శివారు పూందమల్లిలోని డిస్టిలరీ ఫ్యాక్టరీల్లో అవినీతి నిరోధకశాఖ చేపట్టిన తనిఖీల్లో అత్యంత విలువైన డాక్యుమెంట్లు, డిస్టిలరీ ఫ్యాక్టరీలో శనివారం రూ.40 కోట్లు పట్టుబడ్డాయి.