అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా తొలిసారి పాల్గొన్న కార్యక్రమం ఇఫ్తార్ విందు కావడం విశేషం. 

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు దాదాపు రూ.1.1 కోట్లు ఖర్చు అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. లౌకిక దేశంలో మతపరమైన పండుగలను ప్రభుత్వ ఖర్చులతో చేయడం తగదని జగన్ కి హితవు పలికారు. 

భవిష్యత్‌లో ఇలాంటి పోకడలకు నూతన ముఖ్యమంత్రి జగన్ స్వస్తి పలుకుతారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. మతపరమైన పండుగలను ప్రభుత్వ ఖర్చుతో చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఇబ్బందులు పడుతుందని గుర్తు చేశారు. విలాసవంతమైన పోరాటాలతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు. 

లౌకిక దేశంలో మతపరమైన పండుగలను ప్రభుత్వ ఖర్చుతో చేయడం తగదన్నారు. భవిష్యత్ లో ఇలాంటి పోకడలకు కొత్తసీఎం జగన్ తావివ్వరని ఆశిస్తున్నట్లు జీవీఎల్ అభిప్రాయపడ్డారు.