మాస్క్ ధరించకపోతే జరిమానా: కరోనాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

మాస్క్ ధరించకపోతే  రూ. 100 జరిమానాను విధించాలని  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

Impose Rs 100 fine for not wearing mask in Andhra pradesh lns

అమరావతి: మాస్క్ ధరించకపోతే  రూ. 100 జరిమానాను విధించాలని  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్  అధికారులతో సోమవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు.  హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.  ఫంక్షన్ హాళ్లలో రెండు కుర్చీల మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలని  ప్రభుత్వం సూచించింది.

also read:ఏపీలో ఒక్క రోజులో కరోనాతో 27 మంది మృతి, మొత్తం కేసులు 9.68 లక్షలకి చేరిక

సినిమా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం కోరింది.  గ్రామాలు, వార్డు సచివాలయాల ద్వారా  సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.ఎవరైనా జ్వరతో బాధపడినా, కరోనా లక్షణాలు కన్పించినా  పరీక్షలు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని  ఆయన ఆదేశించారు. అంతేకాదు  అవసరమైతే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాని ఆయన సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios