అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా నిర్వాహకులు రెచ్చిపోయారు. రైడ్ చేసేందుకు వచ్చిన పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. పట్టణంలోని ఓ ప్రాంతంలో అక్రమంగా మట్కా సెంటర్ నడుపుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేసేందుకు వెళ్లారు.

పోలీసుల రాకను గమనించిన మట్కా నిర్వాహకులు వారిని అడ్డుకున్నారు. పోలీస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కడపకు చెందిన సీఐ, కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అదనపు బలగాలతో ఘటనాస్థలికి బయలుదేరారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.