మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ కి ఓ బహిరంగ లేఖ రాశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టిడిపి, జనసేన పొత్తు సంగతి తెలిసిందే. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో అనేకసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం లో రెండో మాట లేదంటూ.. అనుభవజ్ఞుడి నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి’’ అని కూడా అనేకసార్లు ప్రకటించారు. అందుకే అందరి మాట ఇదే అని లోకేష్ కూడా ప్రకటించారు.. అంటూ ఈ మేరకు మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ కి ఓ బహిరంగ లేఖ రాశారు.
ఆయన ఈ లేఖలో పవన్ కళ్యాణ్ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ చెబుతున్నట్లుగా పూర్తి కాలం చంద్రబాబును సీఎం చేయడానికి మీ ఆమోదం కూడా ఉందా అంటూ అడిగారు. జనసైనికులు మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వారి కలలు ఏం కావాలని చురకలాంటించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే రెండు కులాల నాయకులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నారని, 80 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు అంటూ పవన్ ను నిలదీశారు.
సొంతోళ్ల మధ్యనే సీఎం జగన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ... మూడ్రోజులు అక్కడే...
జనసేనానికి ఓట్లేస్తే టిడిపి అధినేత ముఖ్యమంత్రి అవుతాడు అనేదాన్ని అభిమానులు జీర్ణించుకోలేరని.. మీరు నీతిమంతమైన పాలన అందిస్తారని అనుకుంటున్న ప్రజానీకానికి ఏం సమాధానం చెబుతారని అడిగారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వైఖరిని జన సైనికులకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
