Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ రిటర్న్ గిఫ్ట్ దేవుడెరుగు: జగన్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇదే..

చంద్రబాబు వైఎస్ జగన్ కు పాలకపగ్గాలు అప్పగించినా అది జగన్ కు ముళ్లకిరీటం లాంటిదంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఏపీ ఖజానాను చంద్రబాబు ఖాళీ చేశారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రచారం కాదు నిజం కూడా. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. 

If jagan comes into power, he has to face cash crunch
Author
Amaravathi, First Published May 6, 2019, 5:15 PM IST

అమరావతి: తెలంగాణ ముందస్తు ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న వార్త రిటర్న్ గిఫ్ట్. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. 

అలాంటి సమయంలో చంద్రబాబుపై కేసీఆర్ వేసిన పంచ్ లు మామూలుగా లేవు. చంద్రబాబు వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన కేసీఆర్ త్వరలో చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై సర్వత్రా చర్చ జరిగింది. 

దాదాపు ఏడు నెలలపాటు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ ఈ రిటర్న్ గిఫ్ట్ పైనే జరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కేసీఆర్ పర్యటిస్తారని అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. 

కేసీఆర్ చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో ఇస్తున్నారో ఎవరికీ తెలియదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు మాత్రం ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చంద్రబాబు ఓటమి ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సీఎం కుర్చీ అప్పగించక తప్పదు, పాలక పగ్గాలు ఇవ్వాల్సిన పరిస్థితి. 

ఇదంతా సహజమే అనుకుంటే అసలైన చిక్కు ఇక్కడే వచ్చి పడింది. చంద్రబాబు వైఎస్ జగన్ కు పాలకపగ్గాలు అప్పగించినా అది జగన్ కు ముళ్లకిరీటం లాంటిదంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఏపీ ఖజానాను చంద్రబాబు ఖాళీ చేశారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రచారం కాదు నిజం కూడా. 

ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఆర్థిక పరిస్థితిపై వైసీపీ నేతలు ఇప్పటికే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ సీఎంగా పగ్గాలు చేపడితే ఏపీ ఆర్థిక పరిస్థితి లెక్కలు చూస్తే బిత్తరపోవాల్సిందేనని ప్రచారం. 

ప్రస్తుతం ఏపీ ఖాతాలో లక్షన్నర కోట్ల అప్పు ఉందని అలాగే సుమారు 44 వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయట. 40 ఇయర్స్ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఆర్దిక వ్యవస్థ నిర్వహణలో దారుణంగా వైఫల్యం చెందారని జోరుగా ప్రచారం జరుగుతుంది. 

ఇకపోతే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కోట్లకు కోట్ల ప్రజాధనం పంచేశారు. పసుపు -కుంకుమ, అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వేలకు వేలు ప్రజల అకౌంట్లో జమచేసి మరీ ఓట్లు అడిగారు చంద్రబాబు. దాంతో ఏపీ ఖజానా మెుత్తం ఖాళీ అయ్యిందట. 

ఖజానా ఖాళీ అవ్వడమే కాదు ఆర్థిక శాఖ సమీక్షలో రూ.44వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు లెక్క తేలిందని తెలుస్తోంది. ఆర్దిక సంవత్సరం మొదలై ఏప్రిల్ మొదటి వారంలోనే ఎనిమిదివేల కోట్ల అప్పుకు ప్రభుత్వం వెళ్లింది. 

ఉద్యోగస్థులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించక నానా పాట్లు పడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్ సీఎం కుర్చీలో కూర్చోవడం ఒక పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి. సీఎం కుర్చీ అధిరోహించినా ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఖజనాలో చిల్లగవ్వలేకుండా పోవడం అది జగన్ కు చంద్రబాబు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios