Asianet News TeluguAsianet News Telugu

ఎబీఎఫ్ నిబంధనలు పాటించలేదు: బిగ్ బాస్ షో ఆశ్లీలత పై ఏపీ హైకోర్టు ఆగ్రహం

బిగ్ బాస్ షో లో అశ్లీలతపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసే విషయాన్ని తదుపరి వాయిదాల్లో నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది. 
 

IBF Rules Violate  Show: Ap High court Serious Comments  On Bigg Boss Show
Author
First Published Sep 30, 2022, 12:57 PM IST

అమరావతి: బిగ్ బాస్ షో లో ఆశ్లీలతపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని  దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం నాడు ఏపీహైకోర్టు విచారణ నిర్వహించింది. 

ఐబీఎఫ్  నిబంధనలను పాటించడం లేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 1970 దశకంలో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.   బిగ్ బాస్ షో పై స్పందించడానికి కేంద్రం సమయం కావాలని కోరింది. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాల్లో నిర్ణయిస్తామని  హైకోర్టు తెలిపింది.  ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

బిగ్ బాస్ షో పై 2019లోనే  కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రియాలిటీ షోలో అశ్లీలత, అసభ్యత, హింస ఎక్కువైందని ఆయన ఆరోపించారు. ఈ  పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరిపించాలని  పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ప్రారంభించింది ఏపీ హైకోర్టు. ఇవాళ కూడ ఈ విషయమై  హైకోర్టు విచారన నిర్వహించింది. 

బిగ్ బాస్ రియాల్టీ షో పై సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ షో ను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో లో చోటు చేసుకుంటునన పరిణామాలపై  నారాయణ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు.  కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని చూసేలా ఈ కార్యక్రమం లేదని నారాయణ  విమర్శించారు. ఈ షోకి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న నటుడు నాగార్జునపై కూడ నారాయణ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.  గతంలో బిగ్ బాస్ షో ప్రసారమైన సమయంలో కూడా నారాయణ ఈ షోపై విమర్శలు చేశారు. ప్రసార మంత్రిత్వశాఖ ఈ విషయమై ఏం చేస్తుందని కూడా నారాయణ ప్రశ్నించారు. దేశంలోని పలు  భాషల్లో ఈ రియాల్టీ షో ప్రసారమౌతుంది. తెలుగులో ఆరో సీజన్ ప్రస్తుతం ప్రసారం అవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios