పార్టీ నేతల నమ్మకాన్ని వమ్ము చేయను: కేశినేని శ్వేత
ఇక నుండి అందరినీ కలుపుకుని పోతానని టీడీపీ మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత చెప్పారు. తనపై పార్టీ నేతలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటానని ఆమె తెలిపారు.శనివారం నాడు బొండా ఉమ మహేశ్వరరావు ఇంటికి వెళ్లిన శ్వేత అసంతృప్తనేతలతో ఆమె చర్చించారు. రేపు చంద్రబాబు టూర్ లో పాల్గొంటామని నేతలు చెప్పారు. శ్వేతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తామన్నారు.
విజయవాడ: ఇక నుండి అందరినీ కలుపుకుని పోతానని టీడీపీ మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత చెప్పారు. తనపై పార్టీ నేతలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటానని ఆమె తెలిపారు.శనివారం నాడు బొండా ఉమ మహేశ్వరరావు ఇంటికి వెళ్లిన శ్వేత అసంతృప్తనేతలతో ఆమె చర్చించారు. రేపు చంద్రబాబు టూర్ లో పాల్గొంటామని నేతలు చెప్పారు. శ్వేతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తామన్నారు.
శనివారం నాడు బొండా ఉమ, నాగుల్ మీరా, బుద్దా వెంకన్న, నెట్టెం రఘురామ్ లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ విజయవాడ నాయకులంతా తన పేరును మేయర్ పదవికి సిఫారసు చేశారు. దీంతో తనను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించారు.
also read:ఇకపై లోపాలకు తావులేకుండా చూసుకొంటాం: బొండా ఉమ
తన పేరును మేయర్ అభ్యర్ధిగా సిఫారసు చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఏనాడూ కూడా వమ్ము చేయనని ఆమె చెప్పారు.
విజయవాడ ప్రగతి కోసం తాను నిత్యం పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎలా తాము కలిసిమెలిసి ఉన్నామో రానున్న రోజుల్లో కూడ అలానే కలిసి మెలిసి ముందుకు సాగుతామన్నారు.క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తానని ఆమె తెలిపారు. ప్రజలు వైసీపీ పాలనలో ఇబ్బంది పడుతున్నారన్నారు.
పార్టీ లైన్ దాటే మనుషులం తాము కాదన్నారు. తమ అభిప్రాయాలను అచ్చెన్నాయుడికి చెప్పినట్టుగా ఆయన వివరించారు. శ్వేత అభ్యర్ధిత్వాన్ని ఎవరూ కూడ వ్యతిరేకించలేదన్నారు.