ఆళ్లగడ్డ: అధికారంలో ఉన్న సమయంలో బాద్యతగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని. ఓటమి పాలైనా ప్రజలకు ఎలాంటి కస్టం కలగకుండా పనిచేస్తానని మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ తేల్చిచెప్పారు.

శనివారం నాడు చాగలమర్రి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తనకు టీడీపీని వీడాలనే ఆలోచన లేదన్నారు. పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషిచేస్తానని ఆమె చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలను కోరారు. 

 సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌కే ఓటు వేయాలని భావించి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.  ఈ కారణంగానే వైసీపీకి పెద్ద ఎత్తున అత్యధిక స్థానాలు వచ్చాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటానని చెప్పారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఆశయాల సాధనకు పునరంకితం కానున్నట్టు ఆమె స్పష్టం చేశారు.