ఈ నెల 20వ తేదీన జనసేనలో చేరుతున్నట్టుగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చెప్పారు.
విజయవాడ: ఈ నెల 20వ తేదీన జనసేనలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చెప్పారు.ఆదివారంనాడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పంచకర్ల రమేష్ బాబు భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత తాడేపల్లిలో పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఇవాళ్టి నుండి తాను జనసేనలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానన్నారు. ఈ నెల 20వ తేదీన సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకు జనసేనలో చేరనున్నట్టుగా పంచకర్ల రమేష్ బాబు చెప్పారు.వైసీపీలో ఆత్మగౌరవం లేదన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో కూడ సీఎంను కలిసే పరిస్థితి లేదన్నారు. తాను డబ్బులు సంపాదించినట్టుగా రుజువు చేసినట్టుగా నిరూపిస్తే తాను గొంతు కోసుకుంటానని స్పష్టం చేశారు.
also read:త్వరలో జనసేనలోకి: పవన్‌కళ్యాణ్‌తో పంచకర్ల రమేష్ భేటీ
జనసేన సిద్దాంతాలు తనకు నచ్చాయని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏ బాధ్యతను అప్పగించినా పనిచేస్తానన్నారు. తాను జనసేనలో చేరుతానని చెప్పగానే పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించినట్టుగా పంచకర్ల రమేష్ బాబు చెప్పారు.మూడు రోజుల క్రితం వైఎస్ఆర్‌సీపీకి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. జనసేనలో చేరడానికే పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి రాజీనామా చేసినట్టుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మూడు రోజుల క్రితం వైఎస్ఆర్‌సీపీకి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. జనసేనలో చేరడానికే పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి రాజీనామా చేసినట్టుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో పీఆర్పీ నుండి పంచకర్ల రమేష్ బాబు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. పీఆర్పీ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు.
2014కు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యాడు. 2020 లో పంచకర్ల రమేష్ బాబు టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
