Asianet News TeluguAsianet News Telugu

2024 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా: డీఎల్ రవీంద్రారెడ్డి

2024 ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

I Will contest in 2024 Elections says Former minister DL Ravindra Reddy
Author
Kadapa, First Published Oct 15, 2021, 4:27 PM IST

కడప:  తాను 2024 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్  రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో DL Ravindra reddy వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది.హైద్రాబాద్ లోటస్ పాండ్ లో ఆయన వైఎస్ జగన్ ను కూడ కలిశారు.ఆ ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలతో ఆయన ycpకి కూడా దూరంగా ఉంటున్నారు.

also read:మైదుకూరు ఉత్కంఠ: జగన్ కు డిఎల్ రవీంద్రారెడ్డి షాక్, ఎత్తుకు పైయెత్తులు

ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు.  రైతును పట్టించుకునే వారే లేరన్నారు. తన సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామనుకున్నా ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు.పాలకులు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా  పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదన్నారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకు ముందు 2014 ఎన్నికల సమయంలో Tdp చీఫ్ Chandrababu ను కలిశారు. అయితే మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి రవీంద్రా రెడ్డి ఆసక్తిని చూపారు. కానీ ఈ స్థానంలో సుధాకర్ యాదవ్ ను టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపింది. అయితే కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేసే విషయమై టీడీపీ తేల్చలేదు.ఈ స్థానం నుండి పోటీకి ఆయన దూరంగా ఉన్నారు.

వైఎస్ జగన్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో కడప నుండి  ఆయన వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేశారు. జగన్ పై  కాంగ్రెస్ అభ్యర్ధిగా డీఎల్ రవీంద్రారెడ్డి  పై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ సమయంలో రవీంద్రారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios