Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ కారులో డెడ్‌బాడీ: రాహుల్ హత్యతో సంబంధం లేదన్న కోగంటి సత్యం

పార్కింగ్ చేసిన కారులో మృతదేహంగా కన్పించిన కరణం రాహుల్ కేసులో అనుమానితుల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కరణం రాహుల్ హత్య విషయంలో కోగంటి సత్యం పేరు ప్రచారంలోకి వచ్చింది. దీంతో  ఈ విషయమై ఆయన స్పందించారు. ఈ హత్యతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఏ విచారణకైనా తాను సిద్దమేనని ఆయన చెప్పారు.

I spoke with karanam Rahul one week before says koganti Satyam
Author
Vijayawada, First Published Aug 20, 2021, 3:14 PM IST

విజయవాడ: పార్కింగ్ చేసిన కారులో శవంగా కన్పించిన కరణం రాహుల్ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని  కోగంటి సత్యం ప్రకటించారు.
మాచవరంలోని పార్క్ చేసిన కారులో కరణం రాహుల్ శవంగా కన్పించాడు. అయితే కారులో దొరికిన ఆధారాల ప్రకారంగా రాహుల్ హత్యకు గురయ్యాడని  పోలీసులు నిర్ధారించారు.

ఈ హత్య విషయంలో పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కోగంటి సత్యం పేరు  తెరమీదికి రావడంతో ఆయన శుక్రవారం నాడు స్పందించారు.
రాహుల్ ఫ్యాక్టరీ అమ్మకానికి ఉందనే విషయం తెలిసి కొనుగోలు చేసేందుకు తాను ఫ్యాక్టరీకి వెళ్లినట్టుగా ఆయన చెప్పారు.

ఈ ఫ్యాక్టరీలో విజయ్ కుమార్ రూ. 19 కోట్లు పెట్టుబడి పెట్టాడని కోగంటి సత్యం చెప్పారు. ఈ ఫ్యాక్టరీలో టీడీపీ నేతలకు కూడా పెట్టుబడులున్నాయని రాహుల్ విజయ్ కమార్ కు చెప్పాడని సత్యం తెలిపారు. 

also read:పారిశ్రామికవేత్త రాహుల్ హత్యలో మహిళ పాత్ర?: ఇంటి వద్ద విషాద ఛాయలు

ఈ ఫ్యాక్టరీలో పెట్టుబడుల విషయంలో విజయ్ కుమార్, రాహుల్ మధ్య గొడవలున్నాయన్నారు.  గత వారం క్రితమే చివరిసారిగా తాను రాహుల్ తో మాట్లాడినట్టుగా కోగంటి సత్యం చెప్పారు. 

కరణం రాహుల్ హత్య కేసు విషయమై పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ఆయన చెప్పారు. ఈ విషయమై తాను ఎలాంటి విచారణకైనా సిద్దమేనని  ఆయన తేల్చి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios