పవన్ కల్యాణ్ పార్టీ కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ పని చేశానని సునీత బోయ అన్నారు. నిర్మాత బన్సీ వాసు తనను మోసం చేశారని ఆమె ఆరోపించారు. మంగళవారం ఆమె రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు.
గత కొంత కాలంగా సినీ నిర్మాత బన్నీ వాసు (bunny vasu)పై ఆరోపణలు చేస్తున్న సునీత బోయ (sunitha boya) తాజాగా మరో సారి ఆయనపై వ్యాఖ్యలు చేసింది. బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకున్నారని, డ్రగ్స్ ఎక్కించారని తీవ్ర ఆరోపణలు చేశారు. బన్నీ వాసు విషయం జన సేన (jana sena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నా.. తనకు అవకాశం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తూర్పు గోదావరి (east godavari) జిల్లాలోని రాజమహేంద్రవరం (rajamahendravaram) ప్రెస్ క్లబ్ (press club)లో మంగళవారం బోయ సునీత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనసేన పార్టీ స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. తాము లైంగికంగా వేధింపులకు గురువుతున్నామని, అయినా పవన్ కల్యాణ్ స్పందించడం లేదని చెప్పారు. తాను జనసేన పార్టీలో మహిళా విభాగం లో సభ్యురాలిగా ఉన్నానని తెలిపారు. తనకు 2019 సంవత్సరంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనలో యాక్టివ్ గా ఉంటున్న మూవీ ప్రొడ్యూసర్ (movie producer) బన్నీ వాసుతో పరిచయం ఏర్పడిందని తెలిపారు.
తాను సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టు (junior artist)గా పని చేస్తున్నానని వాసుకు చెప్పానని సునీత బోయ అన్నారు. దీంతో ఆయన తనకు సినిమాల్లో మంచి ఛాన్స్ లు ఇప్పటిస్తానని నమ్మించారని తెలిపారు. జనసేన పార్టీ (jana sena)లోని వీర మహిళా విభాగంలో పని చేయాలని బన్నీ వాసు తనకు సూచించారని చెప్పారు. వాస్తవానికి తన సొంత డబ్బులతో పవన్ కల్యాణ్ కోసం, ఆయన పార్టీ కోసం తాను పని చేశానని సునీత బోయ చెప్పారు. ఎలక్షన్ (election) టైమ్ లో బన్నీ వాసు రాజమహేంద్రవరం (rajamahendravaram)లో వెంట తిప్పుకున్నారని ఆరోపించారు. అదే సమయంలో తనను లైంగికంగా ఉపయోగించుకున్నారని తెలిపారు. డ్రగ్స్ (drugs) ఎక్కించి పిచ్చిదానిలా మర్చేందుకు ప్రయత్నించారని తీవ్రంగా ఆరోపించారు.
ఈ విషయాలన్నీ గత మూడు సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నానని సునీత బోయ చెప్పారు. తనని మానసిక ఆరోగ్యం సరిగా లేని మనిషిగా చిత్రికరిస్తూ.. తప్పుడు కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబు (naga babu)తో పాటు జనసేన పార్టీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దుర్గేష్ (janasena east godavari district president durgesh) దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లానని ఆమె చెప్పారు. జనసేన పార్టీలోని వీర మహిళ విభాగంలో పనిచేస్తున్న తనకే రక్షణ లేదని సునీత అన్నారు. మరి అలాంటప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ (andhra pradesh)లోని మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ఆమె అన్నారు. మరో రెండు రోజుల వరకు ఎదురు చూస్తానని సునీత అన్నారు. అప్పటి వరకు పవన్ కల్యాణ్ స్పందించాలని కోరారు. లేకపోతే తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తానని సునీత తెలిపారు.
