విశాఖ:  ప్రస్తుత రాజకీయాలకు తాను  సరిపోనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఓటుకి వేలం పాట చోటు చేసుకొందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు  జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన  సేవ్ ఆంధ్రప్రదేశ్  సదస్సు లో  ఆయన మాట్లాడారు.  సంపాదించుకోవడానికే  ప్రస్తుతం రాజకీయాలను వాడుకొంటున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

కనీసం రూ.20 కోట్లు ఖర్చు పెడితేనే  అసెంబ్లీలో అడుగుపెట్టే  పరిస్థితి నెలకొందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. అవినీతిపై  ప్రజల్లో చైతన్యం  తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రతి పనిని పబ్లిసిటీ కోసం వాడుకొంటున్నారని  ఉండవల్లి అరుణ్ కుమార్  ఆవేదన వ్యక్తం చేశారు.