పల్నాడులో దారుణం : భార్యను గొంతు నులిమి చంపి.. భర్త ఆత్మహత్యాయత్నం..
భార్యాభర్తల మధ్య గొడవతో ఓ వ్యక్తి భార్యను గొంతునులిమి చంపేశాడు. ఆ తరువాత ఎలుకల మందు తిని తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు.
పల్నాడు : పల్నాడు జిల్లా సత్తెనపల్లి రంగా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. భార్య గొంతు నులిమి చంపిన ఓ భర్త.. తానూ పురుగులమందు తిని ఆత్మహత్యప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా ఏదో విషయంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ హత్యకు అదే కారణం అయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.