Asianet News TeluguAsianet News Telugu

భార్యను కర్రతో కొట్టి చంపి.. ఉరేసుకుని భర్త ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లాగవు...

ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యసమస్యలు ఓ దంపతులను పొట్టనపెట్టుకున్నాయి. గుంటూరులో ఓ భర్త భార్యను హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. 

husband assassinate wife and committed suicide in guntur
Author
First Published Jan 16, 2023, 1:26 PM IST

గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితులు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. ఈ విషాద ఘటన సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించి స్థానికులు ఈ మేరకు వివరాలు తెలిపారు.. తుమ్మంపాటి చిన్న సుబ్బయ్య(50), తుమ్మంపాటి రోజా (45)ఇదే గ్రామంలో ఉంటున్న భార్యభర్తలు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. 

అయితే, భార్యభర్తలిద్దరూ కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పలు రకాలుగా చికిత్స చేయించుకుంటున్నారు. అయినా వారికి నయం కావడం లేదు. దీనికి తోడు వైద్య ఖర్చులతో ఆర్థి ఇబ్బందులు ఏర్పడ్డాయి. రెండు రకాల సమస్యతో వారు తీవ్రంగా కృంగిపోయారు. ఎలాగైనా దీన్నుండి బయటపడాలనుకున్న చిన్న సుబ్బయ్య... భార్య రోజా తలమీద కర్రతో కొట్టి చంపేశాడు. ఆ తరువాత తాను కూడా అదే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

రంగంపేటలో జల్లికట్టు పోటీలు ప్రారంభం.. భారీగా తరలివచ్చిన జనం.. పోలీసుల ఆంక్షలను లెక్కచేయని నిర్వాహకులు..

అయితే, ఇరుగుపొరుగుతో కలివిడిగా ఉండే ఈ దంపతులు తెల్లారినా బయటికి రాకపోవడం.. అలికిడి లేకపోవడంతో స్థానికులు అనుమానించాడు. ఇంట్లోకి వెళ్లి చూశాడు. అక్కడ ఇద్దరూ చనిపోయి కనిపించారు. దీంతో వెంటనే పొన్నూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికారు. తల, మొండెం, కాళ్లను వేరువేరుగా నరికి పడేశారు. అనకాపల్లిలోని ఎలమంచిలి కొత్తపాలెం బ్రిడ్జి కింద మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు  స్థానికులకు కనిపించాయి. దీంతో వెంటనే వీరు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  హత్యకు గురైన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకున్నారు. 

అతని వివరాలు ఇంకా తెలియరాలేదు. సంక్రాంతి పండుగరోజు ఈ దారుణం వెలుగులోకి రావడంతో స్తానికంగా కలకలం రేగింది. పండగ సెలవులు కావడంతో స్థానిక యువకులు క్రికెట్ ఆడేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ దుర్వాసన వస్తుండడం.. వారి బంతి వెళ్లి పడినచోట డెడ్ బాడీ శరీరభాగాలు కనిపించడంతో వెంటనే.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, మృతదేహం ఉన్న తీరును బట్టి ఆ హత్య నాలుగైదు రోజుల క్రితం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. శరీరంలోని మరికొన్ని భాగాలు ఇంకా దొరకాల్సి ఉంది. 

హత్యకు ఆర్థిక లావాదేవీలా, మరేదైనా కారణమా.. అని అనుమానిస్తున్నారు. స్థానికంగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అతడిని అతి దారుణంగా హత్య చేయడం వెనుక ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ మృతదేహం ఎవరిది అనే విషయం తొందర్లోనే వెలుగులోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios