లోన్ యాప్స్ ఆగడాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత దృష్టి సారించారు.
లోన్ యాప్స్ ఆగడాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత దృష్టి సారించారు. రాష్ట్రంలో లోన్ యాప్ ఆగడాలపై ఆరా తీశారు. లోన్ యాప్ మరణాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని యాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.
లోన్‌ల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. లోన్ యాప్ నిర్వాహకుల మాయలో పడి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. బెదిరింపు కాల్స్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. నిర్వాహకుల బెదిరింపులకు భయపడి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.
