వైసీపీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌కు నిరసన సెగ ఎదురైంది.ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు తన దుకాణాన్ని కూల్చివేశారంటూ ఓ వ్యక్తి సెట్ టవర్‌ ఎక్కి ఆందోళనకు దిగాడు. 

వైసీపీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌కు నిరసన సెగ ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కరాటీ శ్రీను అనే వ్యక్తి ఎంపీ, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీల నిర్మాణం కోసం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు తన దుకాణాన్ని కూల్చివేశారంటూ శ్రీను ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని , లేని పక్షంలో టవర్ పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని అతనిని కిందకి దించేందుకు ప్రయత్నించారు. అయితే ఇంత జరుగుతున్నా ఎంపీ, ఎమ్మెల్యేలు కనీసం ఇటుపక్క తొంగిచూడలేదు.