తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన పాలకమండలి సమావేశం ప్రారంభమవ్వగానే... బోర్డు మెంబర్ పదవికి తెల్లబాబు రాజీనామా చేసి లేఖను ఈవో సింఘాల్‌కు అందజేశారు.

ఈ క్రమంలో సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో ఈవో సింఘాల్‌తో పాటు జేఈవో శ్రీనివాసరాజు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.