తెలుగుదేశం పార్టీ అధినేత , ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బుధవారం కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కేడర్‌ను రెచ్చగొట్టేలా స్థానిక వైసీపీ నేతలు చర్యలు దిగారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత , ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బుధవారం కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో బాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పులివెందులలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్ట్‌ల విధ్వంసంపై యుద్ధభేరీ కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు.. బుధవారం పులివెందులలోని పూల అంగళ్ల సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

చంద్రబాబు వస్తుండటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మరోవైపు.. కొందరు వైసీపీ నేతలు కారులో వచ్చి పార్టీ జెండాలు ప్రదర్శిస్తూ టీడీపీ నేతలను రెచ్చగొట్టారు. దీంతో భగ్గుమన్న టీడీపీ శ్రేణులు వైసీపీ నేతల కారును వెంబడించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు పట్టణంలో భారీగా మోహరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.