ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేపల్లె రైల్వే స్టేషన్‌లో అత్యాచారానికి గురైన బాధితురాలిని రిమ్స్‌కు తరలించారు. అయితే బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన బంధువులను పోలీసులు అడ్డుకున్నారు.
రేపల్లె రైల్వే స్టేషన్ లో (repalle gang rape) సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే రీతిలో మహిళా వలస కూలీపై సామూహిక అత్యాచారం (gang rape) జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. కాగా, అత్యాచార బాధితురాలిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఒంగోలు (ongole rims) రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ప్రత్యేక అంబులెన్స్ లో భారీ భద్రత నడుమ ఒంగోలు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, ఆర్డీవో, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఒంగోలు రిమ్స్ కు వచ్చారు. బాధితురాలిని ఒంగోలుకు తరలించారన్న సమాచారంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కూడా రిమ్స్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ (tdp) ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, ఇతర టీడీపీ నేతలు పరామర్శించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు టీడీపీ నేతలను, బాధితురాలి బంధువులను రిమ్స్ మెయిన్ గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో వారంతా రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు రేపల్లె రైల్వే స్టేషన్ లో వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా జిల్లా ఎస్పీ Vakul Jindal తెలిపారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్ అని ఎస్పీ వివరించారు. విజయ కృష్ణ, నిఖిల్ తో పాటు మరో మైనర్ ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశామని ఎస్పీ చెప్పారు.
ఆదివారం నాడు ఆయన Repalleలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా Avanigaddaలో పని చేసేందుకు ప్రకాశం జిల్లా నుండి భార్యాభర్తలు వచ్చారని ఎస్పీ చెప్పారు. రేపల్లేలో రాత్రి పూట రైలు దిగారన్నారు. అయితే రాత్రిపూట ఆవనిగడ్డకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో రేపల్లేలోనే వారు ఉండిపోయారని SP చెప్పారు. అయితే రాత్రిపూట స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ ఆవరణలోని బల్లపై పడుకున్నారు. అయితే ముగ్గురు నిందితులు రైల్వే స్టేషన్ కు వచ్చి బాదితురాలి భర్తను టైమ్ అడిగారు.
అతని వద్ద వాచీ లేదన్నాడు. దీంతో అతడిని కొట్టారు. అతని వద్ద ఉన్న రూ. 750 తీసుకున్నారు. భర్తను నిందితులు కొడుతుండగా బాధితురాలు అడ్డుకొనే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెపై దాడి చేశారు. ఆమెను పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో రైల్వే స్టేషన్ లో ఉన్న మహిళలను బాధితురాలి భర్త సహాయం కోరాడు. అయితే వారు తాము ఏమీ చేయలేని నిస్సహాయతను వ్యక్తం చేశారని ఎస్పీ వివరించారు. Railway Station కు సమీపంలోని 300 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉందని చెప్పడంతో బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు రైల్వే స్టేషన్ కు రావడంతో పోలీసులు పారిపోయారని ఎస్పీ జిందాల్ తెలిపారు.
