అమరావతి:కృష్ణా నదిపై నిర్మించిన చందన బ్రదర్స్ భవనం కూల్చివేతపై మూడు వారాల పాటు గురువారం నాడు హైకోర్టు స్టే విధించింది.

కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సీఆర్‌డీఏ  నోటీసులు జారీ చేసింది. చందన బ్రదర్స్ భవన యజమానులకు కూడ నోటీసులు జారీ అయ్యాయి.ఈ విషయమై చందన బ్రదర్స్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్‌పై  గురువారం నాడు  విచారించింది. సీఆర్డీఏకు అసలు నోటీసులు జారీ చేసే అధికారమే లేదని  పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.సీఆర్‌డీఏ ఏర్పాటు కాకముందే  తమ భవనాలను నిర్మించినట్టుగా  హైకోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. అనుమతులు లేకపోతే జరిమానాను విధించాలని పిటిషనర్ కోరారు. చందన బ్రదర్స్ భవనాల కూల్చివేయకుండా మూడు వారాల పాటు హైకోర్టు స్టే విధించింది.