Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ జీవోపై స్టే.. ఘాటు వ్యాఖ్యలు చేసిన సీజే ధర్మాసనం..

ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేవదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురం శ్రీకాంత్‌ను నియమిస్తూ జగన్ సర్కార్ విడుదల చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. 

High Court Stay on GO related to AP Endowment department Advisor Appointment
Author
First Published Aug 24, 2022, 2:50 PM IST

ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేవదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురం శ్రీకాంత్‌ను నియమిస్తూ జగన్ సర్కార్ విడుదల చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. వివరాలు.. ఏపీ‌లో వైసీపీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో సలహాదారులను నియమించడం మొదలుపెట్టింది. అయితే ఇటీవల దేవదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్‌ను నియమించింది. సలహాదారుగా శ్రీకాంత్ నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ ‌దాఖలైంది. ఈ పిటిషన్‌పై  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 

శ్రీకాంత్ నియామక జీవోపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది. ఈ సందర్భంగా హైకోర్టు.. ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించడంతో పాటుగా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరతేమైనా ఉందా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉందిగానీ.. శాఖలకు సలహాదారు ఏమిటని ప్రశ్నించింది.  ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని పేర్కొంది. లానే వదిలేస్తే రేపు అడ్వకేట్ జనరల్‌కూ సలహాదారున్ని నియమిస్తారని కామెంట్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios