Asianet News TeluguAsianet News Telugu

అంగళ్లు ఘటన.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఈ నెల 20కి వాయిదా..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.

High Court Postponed chandrababu anticipatory bail petition on Angallu Incident ksm
Author
First Published Sep 14, 2023, 11:19 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. చిత్తూరు జిల్లా అంగళ్లులో చోటుచేసుకున్న ఘటనలో పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు పిటిషన్‌ ఈరోజు విచారణకు రాగా.. ఈ కేసును వాయిదా వేయాలని ప్రభుత్వ తరఫున న్యాయవాది దుష్యాంత్ రెడ్డి కోరారు. 

మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడు పిటిషన్ విచారణ మంగళవారం(సెప్టెంబర్ 19) ఉందని, అదే రోజు ఈ పిటిషన్‌ను కూడా విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. అయితే ఇరుపక్షాలతో మాట్లాడిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. కేసు పూర్తి వివరాలతో హాజరుకావాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇక, అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో ఏ-1గా చేర్చారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. 

ఇదిలాఉంటే,  స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌లు ఈ నెల 19న హైకోర్టులో విచారణకు రానుండగా.. అంగల్లు ఘటనలో చంద్రబాబు ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న హైకోర్టులో విచారణ జరగుంది. 

ఇక, స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ములాఖత్ కానున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios