అమరావతి:టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్లపై టీడీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా పనిచేసిన అధికారులకు కూడ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.

జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయమూర్తి లు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ నార్త్ నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కన్నపరాజు, రేపల్లె నుండి టీడీపీ అభ్యర్ధి అనగాని సత్యప్రసాద్ ఎన్నికను సవాల్ చేస్తూ మంత్రి మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థాని నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి బొప్పన రవికుమార్ లు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.

పిటిషనర్ల తరపున న్యాయవాది మలసాని మనోహర్ రెడ్డి వాదించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే  అభ్యర్ధులు తమ వృత్తి, ఆదాయ వివరాలను పొందుపర్చని విషయాన్ని పిటిషనర్లు గుర్తు చేశారు.