అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు నియంత్రణకు సంబంధించి ప్రభుత్వమిచ్చిన జీవో 15ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం వేసిన వెకేట్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.   

రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలను విస్మరించి అధిక ఫీజులు వసూలు చేయడంపై వైసిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫీజుల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిని విదివిధాలను రూపొందించిన జగన్ సర్కార్ జీవో 15ను జారీ చేసింది.  

అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కొంతకాలం ఈ జీవోపై స్టే విధించింది. తాజాగా ఈ స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం దాఖలుచేసిన వెకేట్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం  దీన్ని తోసిపుచ్చింది.