న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై కేంద్రం  దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై  శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేసింది. హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ వైఖరి తెలపాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. 

వేర్వేరుగా ఎందుకు హైకోర్టులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయకూడదో చెప్పాలని  ఆ పిటిషన్‌లో   కేంద్రం కోరింది. అంతేకాదు 2015, మే 1న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోర్టును కోరింది.

కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా, తెలంగాణ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇప్పుడున్న భవనం లేదా వేరే భవనంలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ముకుల్ రోహత్గీ వాదించారు. 

ఇప్పుడున్న హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ స్పష్టం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. 

కేంద్రం వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తెలంగాణ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. చట్టసభలు, అధికారుల విభజన జరిగింది.. కానీ న్యాయవ్యవస్థ విభజన జరగలేదని ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ వైఖరి తెలపాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.