Asianet News TeluguAsianet News Telugu

కొడితే చచ్చేలా కొట్టండి... బతికితే మాత్రం, నా*** ల్లారా మేం అధికారంలోకి రాగానే : హీరో శివాజీ వార్నింగ్

చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన హీరో శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిపాలన చేయమంటే జనంపై ఎగబడుతున్నారని సీఎం జగన్‌పై ఆయన మండిపడ్డారు. 

hero sivaji serious comments on ap politics
Author
Amaravati, First Published Aug 18, 2022, 10:20 PM IST

తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడూ.. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనూ హీరో శివాజీ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేకహోదా, రాజధాని విషయాలపై జరిగిన ధర్నాల్లోనూ ఈయన పాల్గొన్నారు. కొన్ని టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ పాల్గొని హాట్ కామెంట్స్ చేసేవారు. ఎందుకో తెలియదు కానీ తర్వాత శివాజీ మాయమైపోయారు. అలాంటి ఆయన మరోసారి ప్రత్యక్షమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో శివాజీ మళ్లీ యాక్టీవ్‌గా మారారు. 

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సర్వే చేయించారట. రాష్ట్రంలోని 42 నియోజకవర్గాల్లో సర్వే చేయించానని.. ఇందులో వైసీపీ హవా ఏం కనిపించలేదని, స్వయంగా సీఎం జగన్ కూడా పులివెందులలో వెయ్యి, రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని శివాజీ జోస్యం చెప్పారు. అయితే ఇదే కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్నాయి. తమపై కేసులు పెడుతున్నారని.. తప్పుంటే జైల్లో వేస్తారని, లేదంటే ఏమవుతుందని శివాజీ ప్రశ్నించారు. 

పరిపాలన చేయమంటే జనంపై ఎగబడుతున్నారని సీఎం జగన్‌పై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కొడితే చచ్చేలా కొట్టాలని.. బతికితే మాత్రం ఎవరూ బతకరంటూ శివాజీ వార్నింగ్ ఇచ్చారు. మీరు మనుషులే.. తాము మనుషులమేనని, కాకపోతే పోలీసులు మీ వెనుక వున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రేపు తాము అధికారంలోకి వచ్చాక అదే పోలీసులు మా వెనక్కి రారా , తాము కొట్టించలేమా అని శివాజీ ప్రశ్నించారు. బతుకు బతకనియ్యి అని అంబేద్కర్ చెప్పినట్లు ప్రజలకు సేవ చేయమనే తాము కోరుతున్నామని శివాజీ తెలిపారు. ప్రస్తుతం ఏపీలో సామాన్యుడు బతకలేని పరిస్థితిలో వున్నారని.. మళ్లీ అధికారం మాదే అనే భ్రమల్లోంచి బయటకు రావాలని ఆయన హితవు పలికారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios