ఆంధ్రప్రదేశ్ లో నేటినుంచి వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి కాకుండా.. బుధవారం నుంచే వర్సాలు కురవనున్నాయని తెలిపింది.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో గురువారం నుంచి వర్షాలు మొదలుకానున్నాయని భారత వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. అయితే, వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగా ఈనెల 16వ తేదీ నుంచి కాకుండా బుధవారం నుంచే రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణవరకు ఒక ద్రోణి కొనసాగడమే. దీని ఫలితంగానే కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు.. రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని మంగళవారం నాడు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 17, 18, 19 తేదీల్లో.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, తిరుపతి, కర్నూలు, వైయస్సార్ జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది.
గొప్పొడైతే పోటీ పెట్టను, లేదంటే బందరులో పేర్నినానిని ఓడించాల్సిందే : పవన్ వ్యాఖ్యలు
వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ ఈదురు గాలులు, వర్షాల కారణంగా పంటలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచనలు చేసింది. గోనవరంలో 40.1 డిగ్రీ, అవుకులో 40.53 డిగ్రీలు, నంద్యాల జిల్లా గాజులపల్లిలో 40.61 డిగ్రీలు, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 40.65 డిగ్రీల చొప్పున మంగళవారం నాడు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి.
