చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ 19వ తేదీకీ వాయిదా పడింది.

రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల19కి వాయిదా వేసింది.
చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. గత శనివారం అరెస్టైన చంద్రబాబు వారం రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అరెస్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం చెలరేగింది. ఆయనకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదలు పిటిషన్ సమర్పించారు. కాగా దీని విచారణ శుక్రవారం వాయిదా పడింది.