ఏలూరు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ విగ్రహాం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి చెందిన ఏకేఆర్ట్స్ శిల్పులు డాక్టర్ పెనుగొండ అరుణ్ ప్రసాద్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్‌లు హరికృష్ణ మీద అభిమానంతో విగ్రహాన్ని రూపొందించారు. 

అచ్చం హరికృష్ణను మరిపించేలా విగ్రహాన్ని రూపొందించారు. హరికృష్ణలో ఉట్టిపడే రాజసం విగ్రహంలో కనబడేలా తయారు చేసినట్లు శిల్పులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2 హరికృష్ణ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆయన చిన్న కుమారుడు సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ కు అందజేయనున్నట్లు శిల్పులు అరుణ్ ప్రసాద్ ఉడయార్ తెలిపారు