ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దుండగుల దాడులు ఆగడంలేదు. మొన్న అంతర్వేది, నిన్న నిడమానూరులో పవిత్రంగా భావించే దేవాలయాలపై దాడులు జరగ్గా నేడు తూర్పు గోదావరి జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్దగల ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని దుండగులు విరగ్గొట్టారు. 

వీడియో

ఈ ఘటనతో మరోసారి హిందూ సంఘాలు, భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తూ.గో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పైల సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘటనా స్థలానికి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు.  పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు.