రాష్ట్రంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.
రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చిన్న పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న తరుణంలో స్కూళ్లలో ఉండటం చిన్నారులకు నరకయాతనే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులను (half day schools) నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. వేసవి తీవ్రత దృష్ట్యా తాము విద్యార్థుల ఆరోగ్యాన్ని, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే స్కూళ్లు పనిచేస్తాయని ఆయన చెప్పారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ (EAPCET) షెడ్యూల్‌ను ఇటీవల విడుదల చేసింది. గత ఏడాది నుండి ఎంసెట్ ను ఏపీ ప్రభుత్వం EAPCETగా మార్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి Adimulapu Suresh ఏపీ ఈఏపీసెట్ షెడ్యూల్ ను విడుదల చేశారు. జూలై 4 నుండి 8వ తేదీ వరకు engineering పరక్షలు నిర్వహించనున్నారు. జూలై 11, 12 తేదీల్లో Agriculture పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 134 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే తెలంగాణలో కూడా నాలుగు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆదిమూలపు పేర్కొన్నారు.
కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్ననే ఎంసెట్ ప్రవేశ పరీక్షలను విడుదల చేసింది. ఐఐటీ జేఇఇ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఐఐటీ జేఇఇ ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ మార్పులు చేయడంతో ఏపీ, తెలంగాన రాష్ట్రాలకు చెందిన ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్స్ లో కూడా రెండు రాష్ట్రాలు మార్పులు చేర్పులు చేశాయి. కొత్త షెడ్యూళ్లను రెండు రాష్ట్రాలు గత వారంలోనే ప్రకటించాయి.
