Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో జనసేనతో కలిసే ముందుకు.. రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నాం: ఎంపీ జీవీఎల్

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనేనని చెప్పారు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాం కోరుకుంటున్నారని.. జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

GVL Narasimha rao Says BJP Janasena Alliance Come into Power in Andhra Pradesh
Author
First Published Sep 7, 2022, 1:52 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనేనని చెప్పారు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాం కోరుకుంటున్నారని.. జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీపై సానుకూలత లేదననారు. ఏపీలో జనసేనతో బీజేపీకి పొత్తు ఉందన్నారు. ఇరు పార్టీలు మంచి అండర్‌స్టాడింగ్‌తో కలిసి ముందుకు వెళ్తాయని చెప్పారు. రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో ఈ మేరకు నిర్ణయం చేయడం జరిగిందని.. అప్పుడు అందరూ ఒప్పుకున్నారని చెప్పారు. అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నారు.  

2024లో దేశంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పారు. రాహుల్‌గాంధీ ఎన్ని పాదయాత్రలు చేసినా కాంగ్రెస్‌కు ఉపయోగం లేదన్నారు. ఆ పార్టీ నేతలే కాంగ్రెస్ పని అయిపోందని అంటున్నారని చెప్పారు. 

విశాఖ భూ కబ్జాలపై టీడీపీ, వైసీపీ  రెండు సిట్‌లు వేశాయని... కానీ ఆ రిపోర్టులను బయటపెట్టడం లేదని అన్నారు. విశాఖలో భూములు కొట్టేయడంలో ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య మంచి డీల్ కుదిరినట్టుగా కనిపిస్తోందని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios