గురజాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live
Gurajala assembly elections result 2024: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. అన్ని నియోజకవర్గాల్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి-జనసేన కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇలా పల్నాడు జిల్లా గురజాలలో కూడా ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి.
Gurajala assembly elections result 2024: గురజాల నియోజకవర్గంలో మొదటిసారి (అసెంబ్లీ ఎన్నికలు 2019) వైసిపి విజేతగా నిలిచింది. అంతకుముందు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే గురజాల రాజకీయాలను శాసించాయి. కొత్త వెంకటేశ్వర్లు, గడిపూడి మల్లికార్జునరావు, వెంకట నర్సిరెడ్డి, జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్, జూలకంటి నాగిరెడ్డి, ముత్యం అంకిరెడ్డి, యరపతినేని శ్రీనివాస్ (మూడుసార్లు) టిడిపి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. 1994, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలిచిన యరపతినేని 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.
గురజాల నియోజకవర్గంలోని మండలాలు :
గురజాల
దాచేపల్లి
పిడుగురాళ్ల
మాచవరం
గురజాల అసెంబ్లీ ఓటర్లు (2019 ఎన్నికల వివరాల ప్రకారం) :
గురజాలలోని మొత్తం ఓటర్లు - 2,68,598
పురుషులు - 1,31,719
మహిళలు - 1,36,825
గురజాల అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
గురజాల వైసిపి అభ్యర్థిగా మరోసారి కాసు మహేష్ రెడ్డి బరిలోకి దిగారు.
టిడిపి అభ్యర్థి :
గురజాల అసెంబ్లీ నుడి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహించిన యరపతినేని శ్రీనివాసరావుకే మరోసారి అవకాశం ఇచ్చింది టిడిపి.
గురజాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
గురజాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు 29,486 ఓట్ల తేడాతో YSRCP అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిని ఓడించారు.
గురజాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 :
పోలైన ఓట్లు - 2,25,114 (83 శాతం)
వైసిపి - కాసు మహేష్ రెడ్డి -1,17,204 (52 శాతం) - 28,613 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - యరపతినేని శ్రీనివాసరావు - 88,591 (39 శాతం) - ఓటమి
జనసేన - చింతలపూడి శ్రీనివాసరావు - 12,503 (5 శాతం)
గురజాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 :
నియోజకవర్గంలొ మొత్తం 2,38,623 ఓట్లు వుంటే 1,94,112 ఓట్లు పోలయ్యాయి.
టిడిపి - యరపతినేని శ్రీనివాసరావు - 94,827 (48 శాతం) - 7,187 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - జంగా కృష్ణమూర్తి - 87,640 (45 శాతం) - ఓటమి