గుంటూరులో మెడికో తపస్వి హత్య: గంట ముందే తక్కెళ్లపాడుకి జ్ఞానేశ్వర్, సీసీటీవీ పుటేజీ సీజ్

తక్కెళ్లపాడులో  మెడికో  తపస్విని హత్య కేసులో  ప్రత్యక్షసాక్షి విభాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హత్యకు ముందు జరిగిన పరిణామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Guntur police investigates into the murder case of Medico Tapasvi

గుంటూరు: తక్కెళ్లపాడులో  మెడికో విద్యార్ధిని తపస్విని హత్య విషయమై  పోలీసులు ప్రత్యక్షసాక్షి విభాను ప్రశ్నిస్తున్నారు. సోమవారంనాడు రాత్రి తక్కెళ్లపాడులోని తన స్నేహితురాలు విభా నివాసంలో ఉంటున్న తపస్విపై  జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన  తపస్వి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

రెండేళ్లుగా  తపస్వి, జ్ఞానేశ్వర్ లు ప్రేమించుకున్నారని సమాచారం. ఇన్ స్టా గ్రామ్‌లో జ్ఞానేశ్వర్ , తపస్వి మధ్య పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం  వీరిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది.  జ్ఞానేశ్వర్ తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా  మెడికో తపస్వినితో పరిచయం చేసుకొన్నాడు. అయితే ఇటీవల కాలంలో జ్ఞానేశ్వర్‌ గురించి అసలు విషయాలు తపస్వికి తెలిశాయి. బీటెక్ ఫెయిలైన జ్ఞానేశ్వర్‌ పెయింటర్ గా పనిచేస్తున్నాడని  తపస్వి తెలుసుకుంది. దీంతో అతనికి దూరంగా ఉంటుంది. ఈ విషయమై ఉమ్మడి కృష్ణా జిల్లా నూజీవీడులో  పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తపస్వి గన్నవరంలో  తన స్నేహితులతో కలిసి రూమ్ లో ఉంటుందని సమాచారం. అయితే జ్ఞానేశ్వర్‌ గురించి తెలుసుకున్న తర్వాత పరీక్షలకు ప్రిపేర్ కావడానికి తన స్నేహితురాలు విభా ఇంటికి చేరిందని సమాచారం.

also read:గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. వైద్యవిద్యార్థిని గొంతుకోసి హత్య, తానూ చేయి కోసుకుని..

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులోని విభా నివాసంలో తపస్వి ఉంటున్న విషయాన్ని గుర్తించిన జ్ఞానేశ్వర్‌ మూడు రోజులుగా ఆమె కోసం రెక్కీ నిర్వహించారు. సోమవారంనాడు తపస్విని హత్య చేయడానికి గంట ముందే గ్రామానికి చేరకున్నాడు. బైక్ పై తపస్వి ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. తపస్వితో పెళ్లి విషయమై గొడవపడ్డాడు. తన వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడుతో  ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత బైక్ పై పారిపోయాడు. తపస్విని ఆమె స్నేహితురాలు విభా ఆసుపత్రిలో చేర్పించింది. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  తపస్వి మృతి చెందింది.  బెంగుళూరులో ఉంటున్న తపస్వి పేరేంట్స్  ఇవాళ ఉదయం విజయవాడకు చేరుకున్నారు. మెడికో తపస్విని హత్య చేసిన జ్ఞానేశ్వర్‌ ను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. హత్య జరగడానికి ముందు ఏం జరిగిందనే దానిపై ప్రత్యక్ష సాక్షి విభాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రామంలో సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు సీజ్ చేశారు.  తపస్విని చంపేందుకు రెక్కీనిర్వహించినట్టుగా పోలీసులు ఈ దృశ్యాల్లో గుర్తించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios