ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు నగరానికి విశిష్ట స్థానముంది. ఎందరో నేతలు ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగారు. గుంటూరు జిల్లా నుంచి భవనం వెంకట్రామ్, కాసు బ్రహ్మానంద రెడ్డి, రోశయ్య, నాదెండ్ల భాస్కరరావులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు . తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలు దీని పరిధిలో వున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు నగరానికి విశిష్ట స్థానముంది. ఎందరో నేతలు ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగారు. గుంటూరు జిల్లా నుంచి భవనం వెంకట్రామ్, కాసు బ్రహ్మానంద రెడ్డి, రోశయ్య, నాదెండ్ల భాస్కరరావులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. రాష్ట్రానికి, దేశానికి ఉద్ధండులైన నేతలను గుంటూరు అందించింది.
గుంటూరు ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. రూరల్ ఓటర్ల చేతిలోనే భవిత :
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వున్నాయి. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ . 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో ఆరు సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 2019 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 17,04,431. వీరిలో ఎస్సీ ఓటర్లు 3,30,660 మంది.. ఎస్టీ ఓటర్లు 56,246 మంది.. రూరల్ ఓటర్లు 8,64,147 మంది.. అర్బన్ ఓటర్లు 8,40,284 మంది. గుంటూరు లోక్‌సభకు సంబంధించి మొత్తం పోలింగ్ స్టేషన్‌ల సంఖ్య 1803
1952లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడగా.. నాటి నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీదే డామినేషన్. మధ్యలో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 1957 నుంచి 1977 వరకు వరుసగా ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున కొత్త రఘురామయ్య గెలుపొందారు. 1980 , 1984, 1989లలో రైతు నాయకుడు ఎన్జీ రంగా కాంగ్రెస్ అభ్యర్ధిగా హ్యాట్రిక్ సాధించారు. టీడీపీ, కాంగ్రెస్‌లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతూ రాగా.. 2014 నుంచి ఇక్కడ రాజకీయం మారింది.
రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీదేనని నమ్మిన జనం హస్తాన్ని భూస్థాపితం చేశారు. దీంతో 2014, 2019లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గల్లా జయదేవ్‌కు 5,87,918 ఓట్లు.. వైసీపీ అభ్యర్ధి మోదుగుల వేణుగోపాల రెడ్డి 5,83,713 ఓట్లు , జనసేన అభ్యర్ధి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ 1,25,205 ఓట్లు వచ్చాయి. మొత్తంగా గల్లా జయదేవ్‌కు 4,205 ఓట్ల మెజారిటీ వచ్చింది.
గుంటూరు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. పోటీకి గల్లా నో ఇంట్రస్ట్ :
పార్లమెంట్‌లో ఏపీ వాణిని వినిపించడంలో సక్సెస్ అయిన గల్లా జయదేవ్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతో శెభాష్ అనిపించుకున్నారు. 2019లోనూ మరోసారి టికెట్ దక్కించుకున్న గల్లా జయదేవ్ సెకండ్ టర్మ్ తొలినాళ్లలో కొంత యాక్టీవ్‌గానే వ్యవహరించారు. ఎప్పుడైతే జగన్ సర్కార్ గల్లా కుటుంబానికి చెందిన అమరరాజాపై గురి పెట్టిందో జయ్‌దేవ్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. అంతేకాదు.. తన వ్యాపారాలను తెలంగాణ, తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఓ విందు ఏర్పాటు చేసి మరి చెప్పారు.
గుంటూరు ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024.. బరిలో ఎవరుండొచ్చు :
2024 లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి వైసీపీ తరపున తొలుత ఉమ్మారెడ్డి వెంకటరమణను ప్రకటించారు జగన్. అయితే అనూహ్యంగా ఆయన స్థానంలో కిలారు రోశయ్యను తీసుకొచ్చారు. ప్రస్తుతం పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా రోశయ్య వ్యవహరిస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ప్రకటించడంతో మరో అభ్యర్ధిని చంద్రబాబు వెతుకుతున్నారు.
భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు ఈ రేసులో ముందుంది. సామాజికంగా, ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడంతో పాటు విద్యాసంస్థల అధినేతగా జిల్లా వ్యాప్తంగా రామకృష్ణకు విస్తృత పరిచయాలున్నాయి. మరోవైపు.. టీడీపీ, జనసేనలు ప్రస్తుతం పొత్తులో వుండగా.. బీజేపీ కూడా కూటమిలోకి వచ్చే అవకాశం వుండటంతో చివరి నిమిషం వరకు అభ్యర్ధి ఎవరన్నది సస్పెన్స్‌గానే వుంది.