Asianet News TeluguAsianet News Telugu

తేజస్విని హత్య కేసు : తనను కాదన్నది.. ఎవరికీ దక్కకూడదనే ప్రియురాలి హత్య..

ఈ నెల ఒకటో తేదీన నెల్లూరు జిల్లా గూడురులో జరిగిన ఇంజనీరింగ్ విద్యార్థిని తేజస్విని హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి  వచ్చాయి. తనకు దక్కనికి ఎవరికీ దక్కకూడదనే ఉద్దేశంతోనే ఆమెను చంపేసి, తానూ ఉరివేసుకున్నట్టు నటించిన వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Gudur police arrested three persons in connection with murder of an engineering student Tejaswini - bsb
Author
Hyderabad, First Published Jul 8, 2021, 2:52 PM IST

నెల్లూరు : రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన స్నేహబంధం ఆ యువ జంటలో ప్రేమను చిగురింప చేసింది. రెండేళ్లపాటు ఇద్దరూ కలిసి తిరిగారు. అయితే వారి మధ్య వయసు తేడా ఉండటంతో అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. అమ్మయి పెద్దల మాటను గౌరవించి ఇంట్లోనే ఉండిపోయింది. తనతో మాట్లాడకపోవడం, కనీసం కలవకుండా ఉండడంతో ఆ యువకుడు తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనే... ఉద్దేశంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిని చంపి, ఏం చేయాలో దిక్కుతోచక ఉరితాడుకు వేళాడుతూ పోలీసులకు చిక్కాడు.

గూడూరులో ఈ నెల ఒకటవ తేదీన జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలను ఎస్పీ వెంకటరత్నం బుధవారం విలేకరులకు వివరించారు.  నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఏఎస్సీ  మాట్లాడుతూ తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదని ఆ ఉద్దేశంతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

గూడూరుకు చెందిన గుని శెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్.. తండ్రి చెంచు కృష్ణయ్య, మృతురాలు తేజస్విని తండ్రి సుధాకర్ లు ఏళ్లుగా ఒకే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. వీరిద్దరు స్నేహంగా ఉండడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు తేజస్వినితో స్నేహం పెంచుకున్నాడు.  రెండేళ్లపాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే,  ఇది గమనించిన తేజస్విని (21) తల్లిదండ్రులు ఇద్దరి మధ్య వయసు తేడా ఉండడంతో తమ కుమార్తెను హెచ్చరించారు.

దీంతో ఆమె వెంకటేశ్వర్లు (31)తో మాట్లాడడం మానేసినా,  వెంకటేశ్వర్లు మాత్రం తనను ప్రేమించాలని తరచూ వెంటపడేవాడు దీంతో తేజస్విని తల్లిదండ్రులు కేసు పెడతామని హెచ్చరించడంతో వెంకటేష్ తల్లిదండ్రులు సర్దిచెప్పారు.  అయినా వెంకటేశ్వర్లు మాత్రం తన ప్రేమను మరిచిపోలేదు. కరోనాతో కర్ఫ్యూ విధించడంతో తేజస్విని తల్లిదండ్రులు పూర్తిగా ఇంటికే పరిమితం కావడం, తేజస్విని ఫోన్ నెంబర్ కూడా మార్చడంతో వెంకటేశ్వర్లు మరింత కోపోద్రిక్తుడై అయ్యాడు.

కరుణ తీవ్రత తగ్గడంతో ఈ నెల 1వ తేదీన తేజస్విని తల్లిదండ్రులు విధుల కోసం పాఠశాలలకు వెళ్లారు. అప్పటికే వెంకటేశ్వర్లుతో పాటు స్నేహితులు చిట్టేటి పృథ్వీరాజ్, బండ్ల శివ లు తేజస్విని ఇంటివద్ద  నిర్వహించారు. తేజస్విని తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లిన కొద్ది సేపటికే పృధ్వీరాజ్ అపార్ట్మెంట్లోని తేజస్విని ఫ్లాట్ కి వెళ్లి ఫోన్ నెంబర్ అడిగాడు.  

ఇంతలో వెంకటేశ్వర్లు ఇంట్లోకి ప్రవేశించి  తేజస్వినిని బెడ్ రూం లోకి లాక్కెళ్లి గడియ పెట్టాడు. ఆమెతో మాట్లాడుతూనే అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడపై నిర్దాక్షిణ్యంగా కోసేశాడు. అప్పటికీ చనిపోలేదని భావించి కత్తితో మెడపై  పొడిచాడు.

ఆ తర్వాత పక్కనే ఉన్న టవల్ ను మెడకు గట్టిగా బిగించి చంపేశాడు. ఈ క్రమంలో తేజస్విని అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న వెంకటేశ్వర్లు అక్కడే ఉన్న చీరతో ఉరి వేసుకున్నాడు.  

అప్పటికే ఫ్లాట్ వద్దకు చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు.  చీరకు వేలాడుతూ వెంకటేశ్వర్లు రక్తపుమడుగులో తేజస్విని కనిపించడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు తేజస్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  

వెంకటేశ్వర్లు ప్రథమ చికిత్స చేసి నెల్లూరుకు తరలించారు. మృతురాలి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గూడూర్ రూరల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మ, శ్రీనివాస్ రెడ్డిలు మంగళవారం రాత్రి ఎ-1 వెంకటేశ్వర్లును నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో, ఏ -2,3 చిట్టేటి పృథ్వీరాజ్, బండ్ల శివను బుధవారం ఉదయం గూడూరు రైల్వే స్టేషన్ లో అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు సెల్ఫోన్లు, ఓ బైక్‌, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios