Asianet News TeluguAsianet News Telugu

టీడీపీలో వర్గపోరు.. చంద్రబాబు వద్దకు పంచాయితీ..

విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గపోరు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు తలనొప్పిగా మారింది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, అశోక్ గజపతి రాజుల మధ్య వర్గపోరు మొదలయింది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, టీడీపీ కార్యకర్తలు బంగ్లా రాజకీయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల వేరేగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 

Group Politics In TDP at Vizianagaram District, Andhrapradesh - bsb
Author
Hyderabad, First Published Dec 16, 2020, 1:26 PM IST

విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గపోరు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు తలనొప్పిగా మారింది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, అశోక్ గజపతి రాజుల మధ్య వర్గపోరు మొదలయింది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, టీడీపీ కార్యకర్తలు బంగ్లా రాజకీయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల వేరేగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 

దీనిపై అశోక్‌ గజపతిరాజు, ఆయన వర్గీయులు అధిష్టానానికి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. అయితే అధిష్టానం నుంచి గాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచిగానీ పార్టీ కార్యాలయం మూసివేయాలని ఆదేశాలు రాకపోవడంతో అశోక్‌ వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఈ విషయాన్ని వెలగపూడిలోనే అధినేత వద్దే తేల్చుకుందామని అశోక్‌ సూచనలతో నియోజకవర్గ నేతలు మంగళవారం విజయవాడకు బస్సు, కార్లలో బయలుదేరి వెళ్లారు. అధినేత అపాయింట్‌మెంట్‌ బుధవారం లభించడంతో వారు చంద్రబాబుతో భేటీ కానున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. 

మాజీ ఎమ్మెల్యే గీత కు అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు లోపాయికారీగా మద్దతు అందిస్తున్నారని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకోవడం విశేషం.   

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు పరాభావం ఎదురయ్యింది. అక్రమణదారుల కు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మండలంలోని చింతలపేటలో గ్రామకంఠం భూమి సర్వే నంబర్‌ 34, 36లో 22 సెంట్ల భూమిని టీడీపీ నేత లు అక్రమించుకున్నారు. 

ఆ స్థలంలో అధికారులు రైతు  భరోసా కేంద్రం, పాలశీతలీకరణ కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. ఆ అభివృద్ధి పనులను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో గ్రామంలో వివాదం నెలకొంది. ఆ స్థలాన్ని అక్రమించిన అక్రమణదారులకు మద్దతు తెలిపేందుకు నాగార్జున మంగళవారం ఆ గ్రామానికి వచ్చారు. 

విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆయన్ను అడ్డుకొని గ్రామంలో అభివృద్ది పనులను అడ్డుకుంటారా... పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే మీరెందుకు ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. కాసే పు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకొని నాగార్జునను, మండల టీడీపీ నేతలను పంపించేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios