నాలుగు రోజుల్లో పెళ్లి ఉండగానే  పెళ్లి కొడుకు  అదృశ్యమయ్యాడు పెళ్లి కొడుకు అదృశ్యం కావడంతో  కుటుంబసభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


అనంతపురం: నాలుగు రోజుల్లో పెళ్లి ఉండగానే పెళ్లి కొడుకు అదృశ్యమయ్యాడు పెళ్లి కొడుకు అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని పెనకచెర్ల గ్రామానికి చెందిన రాజప్ప అనే యువకుడు అదృశ్యమయ్యాడు. రాజప్ప వివాహం శుక్రవారం నాడు జరగాల్సి ఉంది. అయితే వివాహా ఆహ్వాన పత్రికలను పంచేందుకు వెళ్లిన పెళ్లి కొడుకు రాజప్ప కన్పించకుండాపోయాడు. 

రాజప్ప సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. రాజప్ప కోసం బంధువులు, కుటుంబసభ్యులు వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రాజప్ప కోసం గాలిస్తున్నారు. వరుడి ఆచూకీ లేకపోవడంతో శుక్రవారం జరగాల్సిన పెళ్లి రద్దైంది.