బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. అందుకు తగినట్లుగానే ఇంట్లో అన్ని ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అంతలో పినతల్లి ఏదో మాట అందని బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పలమనేరు మండలం టి.వడ్డూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వేమన్నకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు.  వీరిలో మొదటి కుమారుడు 20 సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో మృతియచెందాడు. అదే దిగులుతో వేమన్న మొదటి భార్య కూడా కన్నుమూసింది.

 ఆ తర్వాత వేమన్న బోడిబండ్ల గ్రామానికి చెందిన కోకిలను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా.. వేమన్న మొదటి భార్య రెండో కుమారుడు యోగేష్(29) బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతనికి తండ్రి వేమన్న పెళ్లి నిశ్చయించాడు. మార్చి 1వ తేదీన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.

Also Read బాలికల హస్టల్‌లో చికెన్ బిర్యానీ వండి పెట్టిన యువకులు...

పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగానే ఇంటికి రంగులు వేయడం మొదలుపెట్టారు. ఈ నెల 20వ తేదీన ఇంటికి రంగులు వేస్తుంటే ఆ విషయంలో పినతల్లి కోకిలకు, యోగేష్ కి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పినతల్లి తిట్టిందని మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి కోపంగా వెళ్లిపోయాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాడులే అని అందరూ అనుకున్నారు. రాకపోయేసరికి చుట్టుపక్కల గాలించారు.

కాగా..  పెంగుగుంట పొలిమేరల్లోని అడవి సమీపంలో యోగేష్ శవమై కనిపించాడు. బీరులో పరుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు ఎవరితోనే చివరగా ఫోన్లో మాట్లాడడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.